సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
18-08-2026 03:56 PM
బోధన్,(విజయ క్రాంతి): సామాన్యులను సైనికులుగా మార్చి, అన్యాయంపై సమరం చేసిన మహోన్నత శక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సాలూరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్ మీసాల లక్ష్మణ్ గౌడ్, సభ్యులు స్వామి గౌడ్, మొగల గౌడ్, సుధీర్ గౌడ్, శేఖర్ గౌడ్, రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల బంధువు పాపన్న ఆశయాలు నేటి తరానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు






