15 April, 2026 | 2:36 AM

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలి

15-04-2026 12:00 AM

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరూ పాటు పడాలని ప్రభుత్వ విప్, వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక*లో రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. రవాణా శాఖ రూ పొందించిన పోస్టర్లను ప్రభుత్వ విప్, ఆవిష్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న 8 మంది జంటలకు రూ.2 లక్షల 50 వేల ప్రో త్సాహక బాండ్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహ నీయుల ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభు త్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

బిఆర్ అంబేద్కర్ దేశానికి స్వాతంత్య్రo వచ్చాక భారత దేశానికి గొప్ప రాజ్యాంగానికి అం దించారని గుర్తు చేశారు. వివిధ కులాల, మతాల ప్రాంతాల సమూహాల ఆలోచన కు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని, గురుకులాల డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచారని తెలిపారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందజేయాలని ఒకే రకమైన మెనూ తీసుకొచ్చారని వివరించారు.వేములవాడలో 26 లక్షలతో అంబేద్కర్ చౌరస్తా ను ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేశారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఏఎస్ డబ్ల్యూఓ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.