21 August, 2026 | 4:58 PM

జనగామలో టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

21-08-2026 03:27 PM

జనగాం, ఆగస్టు 21 (విజయక్రాంతి): నల్గొండ జిల్లా మల్లేపల్లి నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ శుక్రవారం రోజున జనగాంలో టీఆర్ఎస్ఎంఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ పార్క్ నుండి చౌరస్తా వరకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. విద్యా సంస్థల అధినేతలకు న్యాయం, భద్రత, గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎంఏ జిల్లా అధ్యక్షులు పప్పు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదివే విద్యార్థులే ప్రిన్సిపల్ ను పొడిచి చంపడం చాలా దారుణమని అన్నారు. ఈ ఘటనను ప్రైవేట్ పాఠశాలల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.