23 March, 2026 | 10:19 AM

ఎర్ర హరికృష్ణకు ఉగాది సమ్మేళనంలో సన్మానం

23-03-2026 12:00 AM

తుంగతుర్తి, మార్చి 22 : పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య  స్వగ్రామం వెల్లంకి లో జరిగిన ఉగాది సమ్మేళనం లో ఉమ్మడి నల్గొండ జిల్లా లోని సుమారు 100 మంది కవులు రచయితలు పాల్గొని తమ కవితలు వినిపించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత మరియు జ్యోతిష పండితుడు డా. యర్ర హరికిషన్  ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

‘విఠలాచార్య - విభవం‘ అనే శీర్షికన సీస పద్యాలతో చేసిన కవితా గానం పలువురిని ఆకట్టుకుంది. చివరిలో ఘన సన్మానం చేశారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి  కూనూరు లక్ష్మణ్ ,విశిష్ట అతిధిగా అధికార భాషా సంఘం సంచాలకులు  ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్ ,  తండు కృష్ణ కౌండిన్య  డా. పోరెడ్డి రంగయ్య , సాగర్ల సత్తయ్య పాల్గొన్నారు.