9 March, 2026 | 11:01 PM

బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా వేయించాలి

09-03-2026 03:17 AM

     ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

మేడ్చల్, మార్చి 8 (విజయ క్రాంతి): బాలికలకు తప్పనిసరిగా హెచ్ పి వి టీకా వేయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి ఏరియా హాస్పిటల్ లో హెచ్ పి వి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా పనిచేస్తుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి ఉమా గౌరీ మాట్లాడుతూ హెచ్ పి వి టీకా డి ఎం ఈ, టీవీ విపి ఆధ్వర్యంలోని వైద్య సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.

2011 మార్చి ఏడవ తేదీ నుంచి 2012 మార్చి 8వ తేదీ మధ్య జన్మించిన 14 సంవత్సరాల బాలికలు మాత్రమే ఈ టీకా వేసుకోవడానికి అర్హులని తెలిపారు. జిల్లాలో జి జి హెచ్ కుతుబుల్లాపూర్, మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్, మేడ్చల్ ఘట్కేసర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వి కౌశిక్ మాట్లాడుతూ ఈరోజు 70 మంది బాలికలకు టీకాలు ఇచ్చామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ మల్కాజిగిరి డివిజన్ డాక్టర్ ఎం లావణ్య, ప్రోగ్రాం ఆఫీసర్ కౌశిక్, కుతుబుల్లాపూర్ జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి రాధ, ఎస్ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ సాయి శోభ, డాక్టర్ పల్లవి, డాక్టర్ రాధా కిషన్, డాక్టర్ సునీత, డాక్టర్ శివ కిరణ్, డాక్టర్ సుష్మ, డాక్టర్ మాధురి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా తదితరులు పాల్గొన్నారు.