13 July, 2026 | 4:21 AM

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష

13-07-2026 12:00 AM

మహబూబ్ నగర్ రూరల్ జూలై 12: జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్య బాలిక విద్యాలయాలలో ఆరవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కేజీబీవీ లయందు ప్రవేశము కొరకు ప్రవేశ పరీక్ష జరిగినది. ప్రవేశ పరీక్షను మూడు పరీక్ష సెంటర్లు కేజీబీవీ మహబూబ్నగర్ అర్బన్ కేజీబీవీయందు 67/103. మహబూబ్ నగర్ రూరల్ కేజీబీవీ యందు 71/119, భూత్పూర్ కేజీబీవీ యందు 76/97 విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 319 విద్యార్థులకు గాను214 విద్యార్థులు హాజరు అయ్యారు. పరీక్ష కేంద్రాలను సంబంధిత అధికారులు పరిశీలించారు. ఈ నెల 14 న మోడల్ బేసిక్ పాఠశాల ఎదురుగా నందు మూల్యాంకనం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామని  డీఈవో విజయ కుమారి తెలిపారు.