13 July, 2026 | 3:32 AM

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

13-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 12 (విజయక్రాంతి):సిర్పూర్(టి) మండలం టోంకిని మార్గంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మే రకు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రేషన్ కా ర్డుదారుల నుంచి సేకరించి అక్రమ రవాణా చేస్తున్న 6.20 క్వింటాళ్లరేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బియ్యంతో పాటు ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. బియ్యం తరలిస్తున్న చంకపురే రమశ్, బోర్కుటే సుభాష్ , ఎం.డి. ఇక్బాల్ , కిర్మరే సుదర్శన్ పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు, నిల్వ, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.