రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి
07-05-2026 12:00 AM
- మంత్రి పొన్నం ప్రభాకర్
- బస్వాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శన
కోహెడ, మే 6 : వరి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బస్వాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సందర్శించి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడుతున్న సమస్యలను పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకోచ్చారు.
వెంటనే జిల్లా కలెక్టర్ హైమావతి తో ఫోన్ లో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం కొనుగోలు లో బార్దన్, టార్ఫాలిన్ సమస్య రాకుండా చూసుకోవాలని, లారీలో ఎప్పటికప్పుడు వెంట వెంటనే లోడ్ పంపించేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ అధికారులను, సిబ్బందికి సూచించారు.






