భారీ ఆధిక్యంలో ఇంగ్లాండ్
30-08-2026 12:00 AM
లారెన్స్ హాఫ్ సెంచరీ
లార్డ్స్, ఆగస్టు 29: ఇంగ్లాండ్ టూర్‌లో పాక్ జట్టుకు మరో ఘోర పరాజయం తప్పేలా లేదు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యంలో నిలిచింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ 350 పరుగులకు పైగా ఆధిక్యాన్ని అందుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వర్షానికి ఆట నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. జేమీ స్మిత్(7) తొందరగానే ఔటయ్యాడు. పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్‌పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్‌ను ఛేదించడం కష్టం.






