7 May, 2026 | 3:06 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న

17-12-2025 01:34 AM

నోడల్ అధికారిపై చర్య తీసుకోండి

తాండూరు, డిసెంబర్ 16 (విజయక్రాంతి ):  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకాలలో అవినీతి ,అక్రమాలకు పాల్పడుతూ నిజమైన గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా  నాయకులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పది సంవత్సరాలకు పైగా సేవలు  అందిస్తున్న  అతిథి అధ్యాపకులకు తాజా నియామకాలలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని తెలిపారు. గత కొన్నేళ్లుగా అతిథి అధ్యాపకుల కుటుంబాలు ఆర్థికంగా,మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలు చేసిన నోడల్ అధికారి శంకర్ నాయక్ పై తగు చర్యలు తీసుకొని గెస్ట్ లెక్చరర్ లకు న్యాయం  చేసి అన్యాయంగా విధులనుండి తొలగించబడిన  గెస్ట్ లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించాలని కోరారు.