5 August, 2026 | 2:18 AM

ఇచ్చి పడేద్దాం..

05-08-2026 12:00 AM

సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పళ్లబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ‘కొత్త సోకు’ పాటతో ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు మరో ఎనర్జిటిక్ సాంగ్ ‘ఇచ్చి పడేద్దాం’ను విడుదల చేసింది. ‘ఇచ్చి ఇచ్చి ఇచ్చి పడేద్దాం...’ అనే క్యాచీ హుక్‌తో ప్రారంభమయ్యే ఈ పాట ఫెస్టివల్ మూడ్‌ను క్రియేట్ చేస్తుంది.

‘దావత్ అయినా.. బారాత్ అయినా...’ అంటూ సాగే సాహిత్యం పెళ్లి వేడుకల్లోని ప్రతి ఆనంద క్షణాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ‘ఎవడిది వాడికి ఇచ్చి పడేద్దాం’ అనే రిఫ్రైన్ పాటకు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. పవన్ సీహెచ్ స్వరపర్చిన ఈ పాటను మనీషా ఈరబత్తిని, నితేశ్ అహేర్ ఈ పాట పాడారు. ఆది త్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, వినోద్ కే బంగారి సినిమాటోగ్రఫీ, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.