15 June, 2026 | 2:48 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

అంకోల్‌లో ఎండల లక్ష్మీనారాయణ అరెస్ట్

23-02-2026 01:01 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణలు ఉద్రిక్తత నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నాయకుడు బాన్సువాడ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మార్గమధ్యంలో అంకోల్ గ్రామంలో అరెస్ట్ చేసి నిజామాబాదులో వున్నా వారి ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి  రాష్ట్రంలో హిందువుల పైన దాడులు అక్రమ కేసులతో వేధింపులు పెరిగాయని ఆరోపించారు. 

బాన్సువాడ పట్టణంలో హిందువుల పైన రాళ్లదాడులు జరిగితే దాడులు చేసిన వారిని వదిలేసి హిందువుల ను అక్రమంగా అరెస్టు చేసి హిందువు లను నిధింపులకు  గురి చేస్తున్నారన్నారు , పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలువ కుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితుల పైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందూవుల పైన రాళ్ళ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలనీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు  అత్యంత కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో బాన్సువాడ నియోజకవర్గ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని  ఆయన పోలీసులను హెచ్చరించారు.