ఫిరంగి నాలా ఆక్రమణలను తొలగించాలి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మాజీ ఎమ్మెల్యే బక్కని వినతి
షాద్‌నగర్, ఆగస్టు12 (విజయక్రాంతి): ర ంగారెడ్డి జిల్లాలో సాగు, తాగునీటికి ఎంతో కీలకమైన ఫిరంగి నాలా ఆక్రమణలను తొలగించి, దానిని తక్షణమే పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు కోరారు. బుధవారం హైదరాబాద్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన 90 కిలోమీటర్ల ఫిరంగి నాలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు,
ఆక్రమణదారుల వల్ల దాదాపు 70 శాతం ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నా లా నీటి ప్రవాహ మార్గాలు, బఫర్ జోన్లు మూసివేతకు గురికావడం వల్లే చిన్న వర్షాలకే నగరం జలమయమై ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు. హి మాయత్సాగర్ నుంచి ఇబ్రహీంపట్నం వర కు నాలా సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.






