వజ్రా హోమ్స్‌లో స్థలాల ఆక్రమణ
- అధికార పార్టీ నేతలు భూ దందాలు మానుకోవాలి
- తప్పుడు దస్తావేజులు సృష్టించి ఉన్నవి లేనివి సృష్టించొద్దు
- టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్
సూర్యాపేట, ఏప్రిల్ 12(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 29వ వార్డు లో ఉన్న వజ్రా హోమ్స్‌లో 2015 నుంచి 2018 వరకు అన్ని అనుమతులు తీసుకొని సక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని ప్రస్తుతం నల్ల ఉమా జ్యోతిరెడ్డి తప్పుడు దస్తావేజులు సృష్టిం చి అక్రమంగా అధికార పార్టీ నాయకులు వజ్రా హోమ్స్‌లో స్థలాలను ఆక్రమించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. ఆదివారం వజ్రా హోమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నన్ను ఉమా జ్యోతి రెడ్డికి వజ్రా హోమ్స్‌లో ఎలాంటి భూమి లేకుండా తప్పు డు దస్తావేజులు సృష్టించి 9000 గజాలు తన భర్త చిత్తరంజన్‌రెడ్డి పేర ఉన్నట్లు చూపి స్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నా రు.ఈ విషయమై గతంలో తాను చేసుకున్న అగ్రిమెం ట్ ప్రకారం కోర్టు కేసులను క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మించి తన వద్ద డబ్బు లు తీసుకొని ప్రస్తుతం తప్పుడు పత్రాలతో భార్యాభర్తలు అధికార పార్టీ నాయకు లతో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు.
ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయిందని అనంతరం తప్పుడు దస్తావేజులు రద్దు చేసుకుం టామని మాట్లాడి తన నుంచి రూ.20 లక్షలు తీసుకొని అమెరికాకు వెళ్లిపోయినదని అన్నా రు. ప్రస్తుతం ఆ తప్పుడు దస్తావేజుల ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న అధికార పార్టీని కూడా మోసం చేయగా వారు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని తెలిపారు.
గత ఫిబ్రవరి మాసంలో అమెరికా నుంచి హైదరా బాద్‌కు వచ్చి అధికార పార్టీ నాయకుల అండదండలతో ఎలాంటి భూమి లేకున్నా తప్పు డు దస్తావేజుల ద్వారా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా రని అన్నారు.ఈ విషయమై వజ్రా హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్స్‌కు తెలియక వారు న్యా య సలహా మేరకు వజ్రా హోమ్స్‌లో నల్ల చిత్తరంజన్‌రెడ్డి నల్ల ఉమా జ్యోతి రెడ్డిల ద్వారా ఎలాంటి విక్రయ లావాదేవీలు జరుపకూడదని బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశామని ఈ విషయాలు సూర్యాపేట సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం నోటీసు ద్వారా కూడా తెలియజేశామన్నారు.
నల్ల ఉమా జ్యోతిరెడ్డి నల్ల చింత రంజన్ రెడ్డి లపై పలుమార్లు చీటింగ్ కేసు అయినప్పటికీ మర ల మోసం చేయాలని ఆలోచనతో వజ్రా హోమ్స్‌లో ఉన్న ప్లాట్లను ఇండ్ల స్థలాలను ఆక్రమించుకునేందుకు అనేక రకాలుగా ప్ర యత్నిస్తున్నారనీ వీరిపై విచారణ చేసి మరల ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




