7 July, 2026 | 1:41 AM

వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు

07-07-2026 12:00 AM

అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, జూలై 6 (విజయ క్రాంతి): వి ధి నిర్వహణలో అప్రమత్తత, వేగవంతమైన స్పందన, మానవీయ దృక్పథంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాల ను మల్యాల బ్లూ కోలట్స్ కానిస్టేబుళ్లు మ ధుసూదన్ రెడ్డి, వేణులు కాపాడారు. ఆదివారం సాయంత్రం 5.00 గంటల సమ యంలో మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ శివారులో రైల్వే ట్ప్రా ఓ గుర్తుతెలియ ని వ్యక్తి గాయాలతో పడిఉన్నాడని డయల్-100 ద్వారా సమాచారం అందింది.

సమా చారం అందుకున్న వెంటనే బ్లూ కోలట్స్ సి బ్బంది కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, వే ణు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. తలకు తీవ్ర గాయమై రైల్వే ట్ప్రానే పడిఉండటంతో వెంటనే అతడిని ట్ప్రా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి, 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి గాయపడిన వ్యక్తిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.

సందర్భంగా కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గుర్తిస్తూ నగదు రివార్డును ప్రకటించారు. ప్రజల ప్రాణాలను కాపాడడం పోలీసుల అత్యున్నత బాధ్యత అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించడం, మానవత్వంతో వ్యవహరించడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విధి నిర్వహణలో నిబద్ధత, సేవా భావంతో పనిచేసిన కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, వేణులను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, ఇలాంటి సేవలు పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.