11 March, 2026 | 6:33 AM

విద్యార్థినులకు ఉపాధి కల్పన అవకాశాలు

11-03-2026 12:04 AM

నైపుణ్య అభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ టౌన్, మార్చి 10 :  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు బి ఆర్ ఓ యు జాయిన్ డైరెక్టర్ ధర్మానాయక్ అన్నారు మంగళవారం స్థానిక మహిళ డిగ్రీ కళాశాల నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ ఉన్నదని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించు కోవాలని కోరారు.

మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్ (తెలంగాణ గవర్నమెంట్ ) మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ‘వి_ ఎనేబుల్‘ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని, మహిళా అభ్యాసకుల కోసం నిపుణ ఫెలోషిప్ స్కీం ద్వారా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు అని, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో యూనివర్సిటీకి ఒప్పందం, చేసుకున్నామన్నారు ‘అనువాదిని‘ సంస్థతో భాషా అనువాద రంగంలో అవకాశాల కోసం,

రామనందతీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తా మని తెలిపారు. దూరవిద్య నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ చదువే కాకుండా, డిగ్రీ పూర్తయిన వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దూరవిద్య కేంద్రం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.