21 April, 2026 | 2:41 PM

ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

21-04-2026 12:49 PM

కోదాడ,(విజయక్రాంతి): ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం మహిళా నాయకురాలు వేలది పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలు మెట్లతో నిరసన తెలిపి అనంతరం ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ కు  వినతి పత్రం అందించి , మాట్లాడారు.

వెంటనే కూలి డబ్బులు అందించాలని పొద్దున ఫోటో సాయంత్రం ఫోటో రద్దు చేయాలని పని ప్రదేశాలలో త్రాగు నీరు, టెంట్, మెడికల్ కిట్లు సదుపాయాలు కల్పించాలని అదేవిధంగా వి బి జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ స్పందించి విషయాన్ని జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ తీసుకుని వెళ్తానని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్కె హమీద్ ,జరీనా, జయకృష్ణ, త్రివేణి, విజయమ్మ, సరిత, సంధ్య, సుధాకర్, శ్రీలక్ష్మి, సైదమ్మ తదితర ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.