1 September, 2026 | 10:16 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి

18-04-2026 | 12:23am

టీజీసీపీఎస్‌ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సందీప్ పులిజ్వాల 

జడ్చర్ల, ఏప్రిల్ 17: ఉద్యోగుల డిమాండ్లను పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని టిజిసిపిఎస్‌ఈయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సందీప్ పులిజ్వాల అన్నారు.  జడ్చర్ల మండలం తహసిల్దార్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మార్వో నర్సింగ్ రావుకు వినతిపత్రం అందచేశారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి దృగకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జూన్ రెండవ తేదీ నాటికి పి ఆర్ సీ అమలు చేయాలని, రిటైనర్ ఉద్యోగులకు  పెండింగ్ డిఏ  విడుదల, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్  క్లియరెన్స్ , సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరణ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిపిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.