16 April, 2026 | 2:44 AM

పేపర్ మిల్‌లో ఎన్నికలు నిర్వహించాలి

16-04-2026 01:20 AM

కాగజ్‌నగర్, ఏప్రిల్ ౧5 (విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్‌లో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ లేబర్ పామేలా సత్పతికి  మెమో రాండం అందజేశారు. గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు పేపర్‌మిల్ యాజమాన్యం సహకరించడం లేదని, పైగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.