23 April, 2026 | 1:36 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి

23-04-2026 12:00 AM

ఆర్టీసీ సమ్మెకు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ప్రజా జీవితం స్తంభించి పోయిందని, ప్రత్యేకంగా బీద వర్గాలకు చాల ఇబ్బందిగా తయారైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. వెంట నే కార్మికులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు బుధవారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, థామస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ విద్యానగర్లోని బీసీ భవన్‌లో ఎంపీ ఆర్. కృష్ణ య్య ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆర్టీసీ కా ర్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు బీసీ సంఘం  సంపూర్ణ మద్దతునిస్తుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇది పెండ్లిళ్ళ సమయమని ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతిష్టకు పోకుండా చర్యలు జరిపి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నా రు. సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, కొత్త డిమాండ్లు ఏమి కోరడం లేదన్నారు. ఎన్నికల వాగ్ధానం ప్రకారం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీ నం చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ఆర్టీసిలో సుదీర్ఘ కాలంగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఈ స మస్యలపై దశలవారీగా ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వ, యాజమాన్యాల నుండి నేటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ముఖ్యంగా ఈమధ్య కాలంలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ అద్దె బస్సులను వందలాదిగా ప్రవేశపె డుతూ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న డిపోలన్నిటిని మూసివేసే దిశగా ప్రభుత్వ యాజమా న్యాలు చర్యలు చేపడుతున్నాయన్నారు. అలాగే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలలో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసిని ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, మౌలానా, కె. యాదయ్య, ఎస్. సురేష్, బి. యాదగిరి, బీసీ సంఘం నేతలు జి. అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.