7 April, 2026 | 6:32 PM

గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక

07-04-2026 04:44 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ శ్రీనల్ల పోచమ్మ నూతన ఆలయకమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. గౌరవ అధ్యక్షులు బొల్లు నరసింహారెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా గుర్రాల సిద్దయ్య,వైస్ చైర్మన్గా వివేక్ రెడ్డి, కోశాధికారిగా వెంకట్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు గుడాల సాయిలు, సాయా గౌడ్, కుమ్మరి విట్టల్, బూరుగుపల్లి వెంకటేశం, మహేష్ రెడ్డి, గంపల హనుమంతు, మేకల నారాయణ, ఓం కృష్ణ, మచ్చేందర్ గౌడ్, రాజపేట సంతోష్, కోనేటి దుర్గేష్, కోరపతి శేఖర్, పుట్టి కిషన్, కోడే హనుమంతు, మల్లేశం,పుట్టి కుమార్, పోతుల సిద్ధిరాములు, బన్సీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైనవారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.