7 April, 2026 | 8:31 PM

ప్రతి దాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

07-04-2026 06:18 PM

ఎమ్మెల్యే మందుల సామెల్

అంగన్వాడి సూపర్వైజర్లు టీచర్లకు సెల్ఫోన్ పంపిణీ

తుంగతుర్తి,(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రతిపక్షాలు తట్టుకోలేక రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డును అందించలేదని విమర్శించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండో విడతలు మరింత మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. రైతులు గిట్టుబాటు ధర పొందాలంటే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు.

దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దని సూచించారు. నియోజకవర్గ పరిధిలో 20040 మంది సీఎంఆర్ చెక్కుల గాను సుమారు 80 లక్షల పైచిలుకు చెక్కులను పంపిణీ చేశారు. వేసవికాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నీడ,నీటి వసతి తోపాటు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని  సూచించారు. రైతుల ప్రయోజనాల దుష్ట త్వరలోనే ఎస్ఆర్ఎస్పి సాగునీటి జలాలు సంబంధిత మంత్రి తో ఫోన్లో  మాట్లాడి ,విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.