ఉప సర్పంచుల మండల కార్యవర్గం ఎన్నిక
17-06-2026 07:38 PM
* అధ్యక్షుడు బొల్లంపల్లి రమేశ్
అచ్చంపేట,(విజయక్రాంతి): ఉప సర్పంచుల సంఘం అచ్చంపేట మండల కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు వారాన శ్రీను, నియోజకవర్గ అధ్యక్షుడు వారికుప్పల నిరంజన్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మాపూర్ (పిఎన్) ఉప సర్పంచ్ గొల్లంపల్లి రమేష్ (రాము)ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా సూరాకారం కాశన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మూడవత్ రవీందర్, కార్యదర్శి పాతులవత్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి ముద్దుల బాలయ్య ఎన్నికయ్యారు. వీరిని పలువురు ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సన్మానించారు.






