రేపటి నుంచి యూరియా బుకింగ్ ప్రారంభం
17-06-2026 08:52 PM
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల రైతులకు వ్యవసాయ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు యూరియా సరఫరాను సులభతరం చేసేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూరియా అవసరమున్న రైతులు యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం ద్వారా ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.






