17 June, 2026 | 9:25 PM

ప్రజాసేవలో నిబద్ధతతో పని చేస్తా

17-06-2026 07:42 PM

మంథని ప్రాంతంలో శాంతిభద్రతలకే మొదటి ప్రాధాన్యత

నూతన మంథని సీఐ బుద్ధి స్వామి

మంథని,(విజయక్రాంతి): మంథని నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బుద్ధి స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభినందనలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ స్వామి మాట్లాడుతూ... మంథని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణే నా మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ప్రజలు ఎటువంటి భయం లేకుండా తమ సమస్యలను నేరుగా నాతో పంచుకోవచ్చని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

ప్రజలకు అందుబాటులో పోలీస్ వ్యవస్థ

 ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని, ఆపదలో ఉన్నప్పుడు వెనుకాడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సోషల్ మీడియా అప్రమత్తత

 ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలను కోరారు.

 యువతకు పిలుపు

యువత తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రజలు పోలీసులతో కలిసి పనిచేసినప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు. అనంతరం రామగుండం సిపిని కలిశారు.