10 April, 2026 | 5:28 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి

06-10-2025 01:57 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్

వనపర్తి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు(Election Commission rules) తూచా తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీకానున్న నేపథ్యంలో సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రచార సందర్భంగా కరపత్రాలు, పోస్టర్ల ముద్రణలో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.

ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ఎక్కడ కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని సూచించారు.  ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా ఖచ్చితంగా పేర్కొనాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న పైకం ఎంత అనే వివరాలు ఫారం - బి లో చూపెట్టాలని సూచించారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.