14 May, 2026 | 2:17 PM

గున్కుల్ గ్రామంలో మద్యపాన నిషేధం

14-05-2026 12:59 PM

అమ్మినవారికి పదివేల రూపాయల జరిమానా

నిజాంసాగర్ మే 14( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని గుణుకుల్ గ్రామంలో మద్యపానాన్ని(Alcohol Ban) నిషేధించినట్లు  గ్రామ సర్పంచ్ గంగి రమేష్ తెలిపారు. గ్రామస్తులంతా సమావేశమై గ్రామంలో అసాంఘిక కార్యకలాలు, గొడవలను నిర్మూలించడమే ధ్యేయంగా గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్తులంతా కలిసి  నిర్ణయించామన్నారు. గ్రామంలో ఎవరైనా మద్యపానాన్ని విక్రయిస్తే పదివేల రూపాయల జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు.