14 July, 2026 | 11:11 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

చింతమడకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

01-02-2026 06:07 PM

చింతమడకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లపాటు అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం దారుణమని చింతమడక గ్రామ సర్పంచ్ మోత్కు లతా శంకర్, మాజీ సర్పంచ్ హంసకేతన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కేసీఆర్ స్వగ్రామం చింతమడకతో పాటు సీతారాంపల్లి మాచాపూర్ గ్రామాల్లో సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి పోరాడిన నాయకుడిని విచారణ పేరుతో వేధించడం తగదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గుమ్మడి బాల్ రాజు, చింతల రత్నాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ లు ఎర్రోళ్ల శేఖర్ పంజా బాలయ్య, మిట్టపల్లి ఎల్లవ్వ బీఆర్ఎస్ నాయకులు రెడ్డి  యాదగిరి, పోచంపల్లి కనకయ్య, ప్రసాద్ చెప్యాల మహేష్, రంగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.