చంద్రగ్రహణం నేపథ్యంలో ఏడుపాయల ఆలయం మూసివేత
04-03-2026 12:21 AM
పాపన్నపేట,మార్చి3: చంద్రగ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలో ప్ర సిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని ఉదయం 6 గంటలకు మూసివేశారు.
వేకువ జామున 5 గంటలకు అమ్మ వారికి అభిషేకం, అలంకరణ నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేసారు. బుధవారం వేకువ జామునే ఆలయ శుద్ధి, సం ప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం యధావిధిగా కొ నసాగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.






