సుకన్య సమృద్ధి యోజన అద్భుతమైన పథకం
02-05-2026 07:56 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): సుకన్య సమృద్ధి యోజన పథకం అద్భుతమైనదని తాడ్వాయి తహసీల్దార్ శ్వేత తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో శనివారం అరువురాలైన ముదాం భవిజ్ఞ కు పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ను ప్రారంభించారు. ఈ డబ్బులను గ్రామానికి చెందిన రెడ్డి గారి తిరుపతిరెడ్డి సమకూర్చడం జరిగింది.
భవిజ్ఞ తాత అయిన బాలయ్యను ఈ సందర్భంగా తాసిల్దార్ సన్మానించారు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి అర్హులైన అందరికీ సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం అవసరమైన డబ్బులను తానే స్వయంగా సమకూరుస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి,అడ్వకేట్ రెడ్డి గారి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






