24 July, 2026 | 9:38 PM

ములకలపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

24-07-2026 08:34 PM

ములకలపల్లి,జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ లో బాగంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ములకలపల్లిలో నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ మాట్లాడారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విద్యా రంగం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు.

విద్యార్థులు ఎంతో ఆశ,ఆకాంక్షలతో డాక్టర్లు అవ్వాలని ఆశయంతో నీట్ రాసిన నీట్ ప్రేవేశ పరీక్ష పేపర్ ను లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తు ను గందరగోళం చేసారని అన్నారు. నీట్ పేపర్ లికేజీ అయి రోజులు గడుస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం నేటికి నోరు మోదపకపోవడం సరైంది కాదన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా? లేదా? ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా అనేది తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. నీట్ పేపర్ పరీక్ష పేపర్ లీక్ అయి దేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హత్మ హత్య చేసుకున్నారని హత్మ హత్యలు చెసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అందుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగచైతన్య, సంజయ్, శేఖర్,శరత్ కుమార్, గోపిక, అక్షర, ఏఐఎస్ఎఫ్ నాయకులు నిఖిల్ తేజ,శ్రీ హర్ష, అఖిల్, చిన్ని, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.