రైతుల భూములు కబ్జా సిగ్గుచేటు
- వాటిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
- రిజిస్ట్రేషన్లు నిలిపేసి రైతుల జీవితాలతో చెలగాటం
- రెండు రోజుల్లో రైతుల పక్షాన రామదాస్‌పల్లిలో ధర్నా
- మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వానికి హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): రైతుల భూములు(farmers lands,) కూడా 22ఏ నిషేధిత జాబితా(prohibited list)లోనేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) ప్రశ్నించారు. కమీషన్ల కోసం రైతుల భూ ములను కూడా కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22ఏలో చేర్చి, రిజిస్ట్రేషన్లు(Registrations) నిలిపివే సి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
దీంతో రైతులకు రైతుబంధు, బీమా, బ్యాంకు రుణాలు, యూరియా అందడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్విట్ట ర్ వేదికగా 22ఏ నిషేధిత భూముల జాబితాపై హరీష్‌రావు స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రైతు లు స్వయంగా కలిసి మొరపెట్టుకున్నా పరిష్కారం లభించడం లేదని, కలెక్టర్, ఎ మ్మార్వో సహా ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ భూములు రైతులవేనని రిపోర్ట్ ఇచ్చినా వాటిని నిషేధిత జాబితా నుంచి ఎందుకు తొలగించడం లేదని నిలదీశారు. 30 శాతం కమీషన్ల కోసం కోటి ఎకరాల భూములపై కన్నేశారని ఆ రోపించారు. ఒక్క ఎకరా కూడా కొత్తగా 22ఏలో చేర్చలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెబుతుండగా, రామదాస్‌పల్లి రైతుల భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చాయని నిలదీశారు.
98 శాతం దరఖాస్తులు క్లియర్ చేశామని గొప్పలు చె ప్పుకొంటున్న మంత్రి పొంగులేటి మాట లు బూటకమేనని, భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించలేదని ఆరోపించారు. ఇంటలిజెన్స్ అంతా ప్రతిపక్షాల చుట్టే తిరగడానికేనా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సీ ఎం, ఇంటలిజెన్స్ వ్యవస్థకు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తక్షణమే రైతుల భూములపై నివేదిక తెప్పించుకొ ని 22ఏ జాబితా నుంచి తొలగించాలని, లేకపోతే రెండు రోజుల్లో బీఆర్‌ఎస్ ధర్నా చేస్తుందని హెచ్చరించారు.






