27 August, 2026 | 10:22 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో రాహుల్ గాంధీ

27-08-2026 06:25 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మన్ కీ బాత్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఎలగతి సుచిత్ విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో సమస్యలపై చర్చించాల్సిన రాహుల్ గాంధీ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని అపరాధిగా చూపించే రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నీట్‌ పరీక్ష అంశంపై ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు.