రాఖీ.. అనుబంధానికి ప్రతీక
28-08-2026 12:54 AM
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే పర్వదినం రాఖీ. సోదరుడి మణికట్టుకు రాఖీ కడుతూ అక్కాచెల్లెళ్లు తమ ఆత్మీయతను చాటుకుంటే.. సోదరులు ప్రేమతో కానుకలు అందిస్తూ ఆ బంధాన్ని మరింత బలపరుస్తారు. కాలం మారినా.. పరిస్థితులు మారినా.. రాఖీ పండుగ సోదరసోదరీమణుల అనుబంధాన్ని మరింత పదిలం చేస్తూనే ఉన్నది. ప్రేమ, ఆప్యాయత, నమ్మకాలకు ప్రతిరూపంగా నిలిచే ఈ పవిత్ర బంధానికి రాఖీ పండుగ ఓ మధుర జ్ఞాపకం. శుక్రవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని లాలపేట, బేగంబజార్లలో రాఖీలు కొనుగోలు చేస్తున్న మహిళలు.






