15 May, 2026 | 2:06 AM

ఏసీబీకి చిక్కిన దుగ్గొండి ఆర్‌ఐ

15-05-2026 12:00 AM

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

వరంగల్ (మహబూబాబాద్), మే 14 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆర్‌ఐ రాంబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వారసత్వంగా వచ్చిన భూమిని నమోదు చేయడానికి చేసుకున్న దరఖాస్తును పరిశీలించడానికి ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా రాంబాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్‌ఐ రాంబాబు మరికొద్ది రోజుల్లోనే పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.