22 August, 2026 | 7:26 PM

స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో రూ.3.50 లక్షల డ్యూయల్ డెస్క్లు

22-08-2026 06:27 PM

కల్లూరు,(విజయక్రాంతి): ఎకమ్ (USA) ఫౌండేషన్ సౌజన్యంతో, స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రూ.3.50 లక్షల విలువైన 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందించారు. కాలాలివాడకు 7, గోపాలదేవబోయినపల్లికి 10, కిష్టయ్య బంజర్‌కు 3, పుల్లయ్య బంజర్‌కు 8, వచ్చానాయక్ తండాకు 8, హనుమాతండాకు 3, తూర్పు లోకవరానికి 3, పడమట లోకవరానికి 8 బెంచీలు పంపిణీ చేశారు.

బెంచీలు లేక విద్యార్థులు నేలపై కూర్చోవడాన్ని గమనించి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి ముందుకొచ్చింది. త్వరలో మండలంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు కూడా బెంచీలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ పద్మతో పాటు స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చింతలపూడి కృష్ణ, మర్రెల వెంకటేశ్వరావు, ఉబ్బన వేణుబాబు, ఎస్‌కే ముజీమ్, తెల్లపుట్ట రాంబాబు, వీరేంద్ర, అరవింద్ పాల్గొన్నారు.