27 February, 2026 | 11:22 PM

Breaking News

కంచర్ల గ్రామంలో డ్రై డే–ఫ్రై డే కార్యక్రమం

27-02-2026 08:54 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కంచర్ల గ్రామంలో సర్పంచ్ గొల్ల అరుణ స్వామి ఆధ్వర్యంలో డ్రై డే–ఫ్రై డే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధులు, పరిసరాలను శుభ్రం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామంలో నాటిన చెట్లకు నీరు పోసి సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొని గ్రామ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.