28 February, 2026 | 12:12 AM

రేవంత్ రెడ్డి బీజేపీ, టీడీపీకి కోవర్టు

27-02-2026 08:44 PM

- ఎస్సీ వర్గీకరణతో మాలలను అణచివేసి కుట్రలు

హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీ, టీడీపీకి కోవార్టుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని మాల సంఘాల జాక్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల సంఘాల జాక్ రాష్ట్ర చైర్మన్ మందల భాస్కర్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు మూలంగా మాలలు విద్యా, ఉద్యోగ రంగాల్లో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

మాల సంఘాల విద్యార్థి జాక్ రాష్ట్ర చైర్మన్ మదాసి రాహుల్ రావు మాట్లాడుతూ అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ ద్వార మాలలను అణచివేసే కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాలలకు రిజర్వేషన్లు తొలగించే కుట్రలు చేస్తున్నారన్నారు. మాలలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏ పార్టీలో ఉన్న వెంటాడి ఒడిస్తాం అని హెచ్చరించారు.

మాల సంఘాల జాక్ గౌరవ అధ్యక్షులు చెరుకు రామచందర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తూ మాలలకు అన్యాయం చేస్తే ఊరుకోబో మన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల ఆప్రమత్తంగా ఉండి, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పునర్ పరిశీలించాలన్నారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గిన గుణపాఠ చెబుతామన్నారు. ఈ సమావేశంలో నాయకులు బండి అశోక్, కంకణాల సంతోష్,దండు మోహన్, పానుగంటి లక్ష్మీనారాయణ, దండ్రి శ్రీనివాస్, గురిమిల్ల రాజు, శేషాద్రి నాగులు కునముల్ల అనిత, దావా రవి తదితరులు పాల్గొన్నారు.