11 April, 2026 | 11:28 PM

సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం

11-04-2026 09:23 PM

సిద్దిపేట క్రైం: మద్యం, మాదకద్రవ్యాల వ్యసనపరులు తిరిగి సాధారణ జీవితం గడపడానికి డీ అడిక్షన్ కేంద్రాలు దోహదపడతాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 10 పడకల మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం, డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్ ను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు.

సమాజంలో ప్రస్తుతం పెరుగుతున్న మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేంద్రాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మత్తు రహిత జిల్లాగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో  సైకియాట్రిస్ట్ హెచ్వోడీ శాంతి, హెచ్వోడీ సురేష్ బాబు, వైద్యులు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.