ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకలు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహనీయుల జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు న్యాతరి ప్రభాకర్, న్యాయ సలహాదారులు కోడం అజయ్, గౌరవ సలహాదారులు న్యాతరి శ్రీనివాస్, తదితరులు మాట్లాడుతూ... జ్యోతిరావు పూలే సమాజంలోని అడుగు వర్గాలు జ్ఞానాన్ని పొందేందుకు విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు తమ జీవితాలను ధారబోసి నేడు మహనీయులయ్యారని స్పష్టం చేశారు.
సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు విద్య ద్వారానే అన్ని సాధ్యం అవుతాయని, తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా మొట్టమొదటిసారి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించారని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని విద్యను అందించి ఆదర్శంగా నిలిచారన్నారు. అలాంటి మహానీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వారి ఆశ సాధన కోసం కృషి చేయాలని సూచించారు.
జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఉపాధ్యక్షులు చిలుక రాజేశం ఆరేపల్లి రాహుల్ , ఆరేపల్లి రాకేష్ , ప్రధాన కార్యదర్శి కన్నూరి ప్రభాకర్, ముఖ్య సలహాదారు మాజీ ఎంపీటీసీ సభ్యులు సంకేనపల్లి లక్ష్మణ్, మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కల్వల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పారపు దయాకర్, ఆరేపల్లి ఇలా రావు, ఎనగందుల నాంపల్లి,గొర్రె వెంకటస్వామి, తాళ్లపల్లి లక్ష్మణ్, ఆరేపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.




