స్వామి వివేకానంద యువతకు శాశ్వత స్ఫూర్తి
మంథనిలో స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్
మంథని, జూలై 04(విజయక్రాంతి): స్వామి వివేకానంద 124వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయమైన మహనీయుడని అన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుల్లో స్వామి వివేకానంద ఒకరని పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు.
నేటి యువత స్వామి వివేకానంద బోధనలను ఆచరణలో పెట్టి క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మంథని పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, కాంగ్రెస్ నాయకుడు ఏల్పుల సత్యం, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు కనుకుంట్ల స్వామి, మంథని రాజేశం తదితరులు పాల్గొని స్వామి వివేకానందకు నివాళులర్పించారు.






