4 July, 2026 | 1:20 PM

అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య

04-07-2026 12:11 PM

 అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): సమాజంలో అణచివేత, అన్యాయం, దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మార్మట్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి(Doddi Komaraiah Death Anniversary) కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డి ఆర్ ఓ దాసరి వేణు తో కలసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ భూస్వాముల ఆగడాలు, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నదీమ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్  అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగ, మాజీ ఎంపీపీ అలిగిల మల్లికార్జున్ యాదవ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేష్, నాయకులు మాధవ్, దినేష్, లజిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.