నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్
11-04-2026 09:26 PM
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలంలోని అన్నీ పెట్రోల్ బంక్ యజమానులతో చౌటుప్పల్ డిఎస్పి పి.మధుసూదన్ రెడ్డి తన ఆఫీసు నందు అందరితో అక్కిడెంట్స్ కు సంబందించి ఎరైవ్ & ఏ లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్ కార్, బండి లోనే పెట్రోల్ ,డీజిల్ కొట్టాలి, బాటిల్ లో, క్యాన్ లలో ఎట్టి పరిస్థితిలో కొట్టరాదు. ప్రతి బంకులో సీసీ కెమెరాలు అమర్చాలి, అట్టి కెమెరాలు రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమానులు మరియు చౌటుప్పల్ యస్.ఐ కనకటి యాదగిరి,యస్.ఐ కె. ఉపేందర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.




