13 May, 2026 | 12:10 PM

Breaking News

బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •   పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగస్వామి.. 5వ సారి ప్రమాణ స్వీకారం   •  

రావల్పిండి స్టేడియాన్ని ఢీకొట్టిన డ్రోన్

09-05-2025 03:35 AM

‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత్ దాడులు

రావల్పిండి, మే 8: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాక్ సహా పీవోకే ఉగ్రస్థావరాలనే టార్గెట్‌గా చేసుకుని మన భూ గగనతలం నుంచే భారత్ దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ కేంద్రమైన రావల్పిండిపై డ్రోన్ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రావల్పిం డి క్రికెట్ స్టేడియంలో ఒక డ్రోన్ కూలినట్టు సమాచారం.

డ్రోన్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తర లించారు. అయితే స్టేడియంలోని కొంతభాగం దెబ్బతినడంతో  పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌లను కరాచీకి తరలించినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ వరుస దాడులతో పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెట ర్లు వెంటనే పాక్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.