28 August, 2026 | 6:56 AM

ఫాలో ఆన్ వ్యూహం బెడిసికొట్టిందా?

28-08-2026 12:31 AM
  1. పిచ్‌ను అంచనా వేయలేకపోయిన భారత్
  2. గెలిచే మ్యాచ్ చేజార్చుకుందని విమర్శలు

కొలంబో, ఆగస్టు 26 : శ్రీలంక(Sri Lank)తో రెండో టెస్టులో దాదాపు నాలుగు రోజుల ఎక్కువ శాతం భారత్‌(India)దే అధిపత్యం కనబరిచింది. చివరి రోజు 4 వికెట్లు తీస్తే చాలు 2-0తో సిరీ స్ సొంతమవుతుంది. కానీ చివరి రోజు లంక అద్భుత పోరాటం కారణంగా మ్యాచ్ డ్రా(match draw) కావడంతో భారత్ 1-0తో సిరీస్‌ను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే లంకను ఫా లో ఆన్ ఆడించాలన్న  భారత్ వ్యూహం బెడిసికొట్టింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంకపై భారత్ ఫాలో ఆన్ విధించిన గత 8 సార్లు విజయం సాధించింది. కానీ తొలిసారి ఆ రికార్డు బద్దలై మ్యా చ్ డ్రా అయింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉండి ఉంటే ఒత్తిడి పెరిగేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఫాలో-ఆన్ ఆడించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారన్నారు. సాధారణంగా టెస్ట్ లో ఆఖరి రోజు పిచ్ స్పిన్‌కు అనుకూలించాలని, కానీ ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన శ్రీలంక.. తమకు అనుకూలమైన వికెట్‌ను సిద్ధం చేసుకుందని వాపోయారు.

ఈ విషయాన్ని గ్రహించడంలో భారత మేనేజ్‌మెంట్ విఫలమైందని మండిపడుతున్నారు. డ్రా ఓటమిలా బాధించట్లేదని గిల్ పేర్కొన్నప్పటికీ, ఫాలో ఆన్ ఇవ్వకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడి భారీ టార్గెట్ నిర్దేశించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మ్యాచ్ గెలిచి ఉంటే వరల్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్కు మరింత లబ్ధి చేకూరేది, కానీ డ్రా అవ్వడం కొంత నిరాశపరిచింది.