22 April, 2026 | 3:56 AM

బోయినపల్లిలో చలివేంద్రం ప్రారంభం

22-04-2026 12:56 AM

బోయినపల్లి: ఏప్రిల్ 21(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ నల్ల మోహన్ వార్డు సభ్యులతో కలిసి చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎండాకాలం కావడం తో ప్రజల దాహార్తి తీర్చేందుకు బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ పనులకోసం మండల కేంద్రానికి వచ్చే వారికి, ప్రయాణికులకు చలివేంద్రం ఎంతో దోహదపడుతుందని అన్నారు.

అనంతరం గ్రామంలో వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలోని రైతుల బావులనుండి మీరు తీసుకొని గ్రామంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలు భావులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు బొజ్జ నరేందర్, దూస శ్రీనివాస్, నాయకులు మెరుపుల జలంధర్, మెరుపుల గంగాధర్, వాసల శ్రీనివాస్,బొడ్డు తిరుపతి,తదితరులు ఉన్నారు.