6 April, 2026 | 3:57 AM

మన ఫ్రెష్ మిల్క్ డెయిరీ ఔవుట్‌లెట్‌ను ప్రారంభించిన డాక్టర్ కడియం కావ్య

06-04-2026 12:38 AM

వరంగల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): హనుమకొండలోని కనక దుర్గ కాలనీలో నూతనంగా ఏర్పా టు చేసిన ‘మన ఫ్రెష్ మిల్క్’ డెయి రీ ఔట్లెట్ను స్థానిక శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగాఎంపీ కావ్య మాట్లాడుతూ స్థానికంగా నాణ్యమైన పాలు, పాలు ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఇలాంటి చిన్న వ్యాపారాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. స్థానిక యువత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి సాధించేందుకు ఇలాంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరమని తెలిపారు.