26 May, 2026 | 4:24 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

ఖానాపూర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ దోస్తీ

06-04-2026 03:49 AM
  1. బీజేపీకి చైర్మన్, బీఆర్‌ఎస్‌కు వైస్ చైర్మన్
  2. మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠకు తెర
  3. ఫలించిన ప్రతిపక్షాల పొత్తు 
  4. అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ

ఖానాపూర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): గత నెలన్నర రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన నిర్మల్ జిల్లా ఖా నాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. చైర్మన్ ఎన్నికకు మూడుసార్లు అధికారులు ఎన్నికల నిర్వహించగా తీవ్ర గందరగోళం మధ్య మూడుసార్లు వాయిదా పడింది. సోమవారం నిర్వహించిన ఎన్నికలో ప్రతిపక్షాల పొత్తు ఫలించింది.

చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్ షోయబ్ ఎన్నికయ్యారు. కౌన్సిలర్ ఫలితాలు వెల్లడైన ప్పటినుంచి ఉత్కంఠగా మారిన చైర్మ న్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ ఎస్ ఒక్కటవ్వాల్సిన పరిస్థితి నెలకొం ది. మొత్తం 12 వార్డులకు గాను కాం గ్రెస్‌కు మూడు, బీజేపీకి నాలు గు, బీఆర్‌ఎస్‌కు నాలుగు, ఒకరు ఇం డిపెండెంట్ అభ్యర్థులు గెలవగా, ఇండి పెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారి సంఖ్య 4 కు చేరింది.

మూడు పార్టీలకు సమాన బలాలు ఉండటంతో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5కు పెరిగింది. అనంతరం జరిగిన జాప్యంతో బీఆర్‌ఎస్ శిబిరంలో నుం చి మైస పోచమ్మ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినప్పటికీ పూర్తిస్థాయి బలం సమకూరలేదు.

దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజారిపోయినట్లు అయిం ది. శనివారం అధికారులు ఎన్నికకు ఏర్పాట్లు చేసినప్పటికీ చేతులు లేపడంలో గందరగోళం ఉన్నదని అధి కార పార్టీ ఎమ్మెల్యే, వారి సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎన్నిక ఆదివారం నాటికి వాయిదా పడగా పోలీసుల భారీ బందోబస్తు మధ్యలో ఎన్నిక జరిగింది. ఎట్టకేలకు బీఆర్‌ఎస్ మద్దతుతో బీజేపీ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. దీంతో చైర్మన్ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అధికార పార్టీకి చుక్కెదురు అయింది.