3 March, 2026 | 10:23 PM

వన్య ప్రాణులను కాపాడండి: డా.జాస్తి సుబ్బారావు

03-03-2026 08:13 PM

కోదాడ: వన్య ప్రాణులను కాపాడాలని డా.జాస్తి సుబ్బారావు అన్నారు. కోదాడ రచయితల సంఘం తెలంగాణ సాహితీ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం నాడు కోదాడ పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యులు డా:జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ... మనుషులకు జీవించే హక్కు ఉన్నట్లే పక్షులకు, జంతువులకు కూడా ఈ భూమి మీద జీవించే హక్కు ఉందని వాటి స్థావరాలను ధ్వంసం చేయకుండా కాపాడాలని, పర్యావరణంను పరిరక్షించాలి.

జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్నారు. ఈ సందర్భంగా వన్య ప్రాణులను రక్షించండి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర పెన్షనర్స్ సంఘం ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ రచయితల సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణమూర్తి,కోశాధికారి సేకు శ్రీనివాసరావు, కవులు మధుసూదన్ రెడ్డి, జానకీ రామ్,జి.వెంకటేశ్వర్లు, పెన్షనర్స్ పందిరి రఘు, డిఎన్ స్వామి, వీరబాబు, జాన్ షరీఫ్, పలువురు కవులు పెన్షనర్స్ పాల్గొన్నారు.