ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉద్యమానికి ఆరంభమే డా.దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, జూలై 25(విజయక్రాంతి): కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సాధించిన తొలి విజయమేనని, ఇది ఉద్యమానికి ముగింపు కాదని ఆప్ చీఫ్ స్పోక్స్పర్సన్ డా. దిడ్డి సుధాకర్ అన్నారు.
నీ ట్ పరీక్షల అవకతవకలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉద్యమం మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. శనివారం లిబర్టీలోని రా ష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభిషేక్, దీపిక ఇచ్చిన పిలుపుతో ప్రారంభమైన ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా విదేశాల్లోని భారతీయుల నుంచి కూడా విశే ష మద్దతు లభించిందని తెలిపారు. సోనం వాంగ్చుక్ మద్దతు ఉద్యమానికి మరింత బలాన్నిచ్చిందన్నారు. దేశంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.






